Mon Dec 23 2024 03:41:38 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 8
బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో మరింత ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. యష్మీ, సీత, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, మెహబూబ్, గంగవ్వతో సహా ఆరుగురు పోటీదారులు ఈ వారంలో ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్నారు. అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్లో సీత, విష్ణుప్రియలు ఉన్నారు. మిగిలిన నలుగురు పోటీదారులు మంచిగా ప్రజల మద్దతును పొందగలిగారు. విష్ణుప్రియ, సీత బిగ్ బాస్ హౌస్ లో వారి స్థానం కోసం పోరాడుతున్నారు. తాజా అప్డేట్ల ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
కిరాక్ సీతకు ఈ వారం అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ తెలుగు 8 హౌస్ నుండి వీడ్కోలు పలికిందని అంటున్నారు. 5 వారాల తర్వాత సీత ప్రయాణం ముగిసింది. ఆదివారం రాత్రి సీత ఎలిమినేషన్ ప్రసారం కానుందని అంటున్నారు. ఓట్ల లెక్కింపులో విష్ణుప్రియ చేతిలో తృటిలో ఓడిపోవడంతో ఆమెపై ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ఇది లీకైన న్యూస్ మాత్రమే!!
Next Story