Mon Dec 23 2024 08:27:01 GMT+0000 (Coordinated Universal Time)
BiggBoss 6 Day 91 : ఈవారం ఫైమా ఎలిమినేట్.. చేతిపై ముద్దిచ్చిన నాగ్.. ఒక్కొక్కరికి ఒక్కో పోస్టర్
రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డిని కలిసే అవకాశం లేకపోవచ్చని అన్నాడు. రోహిత్ కూడా రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో
బిగ్‌బాస్ సీజన్ 6..మొత్తానికి 13 వారాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే. హౌస్ లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఇక ఈ ఆదివారం ఎపిసోడ్ విషయానికొస్తే.. చాలా సరదాగా సాగిపోయింది. మొదట కంటెస్టెంట్స్ అందరిని హౌస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో జీవితాంతం ఫ్రెండ్ గా ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎవరు అసలు ఫ్రెండ్ గా వద్దనుకుంటున్నారో చెప్పమన్నాడు నాగార్జున. దాంతో.. మొదట ఆదిరెడ్డి..ఫైమాను ఫ్రెండ్ అని, ఇనయతో ఫ్రెండ్షిప్ ఉండదంటూ తనకున్న రీజన్స్ చెప్పాడు. ఇనయా.. కీర్తిని ఫ్రెండ్‌గా, శ్రీహాన్‌తో ఫ్రెండ్షిప్ కష్టమే అని చెప్పింది.
శ్రీహాన్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డిని కలిసే అవకాశం లేకపోవచ్చని అన్నాడు. రోహిత్ కూడా రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో స్నేహం కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నాడు. ఫైమా.. ఆదిరెడ్డి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అని, రోహిత్‌తో ఎక్కువ కనెక్షన్ లేదని చెప్పింది. కీర్తి.. ఇనయా ఫ్రెండ్, శ్రీహాన్ ఫ్రెండ్ కాదు అని చెప్పింది. రేవంత్.. శ్రీసత్యతో ఫ్రెండ్షిప్ మైంటైన్ చేస్తానని, కీర్తి అసలు అర్ధం చేసుకోదన్నాడు. శ్రీసత్య.. రేవంత్‌తోనే క్లోజ్ అయ్యాను అని, రోహిత్ తో కనెక్షన్ తక్కువ అని చెప్పింది.
ఆ తర్వాత.. రీసెంట్ గా హిట్ కొట్టిన హిట్ 2 మూవీ టీమ్ అడివి శేష్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ శైలేష్ కొలను బిగ్‌బాస్ స్టేజిపైకి వచ్చి.. సందడి చేశారు. హిట్ 2 టీమ్ కంటెస్టెంట్స్ ఓ గేమ్ ఆడించారు. ఆ తర్వాత.. నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమా ఉండగా.. కంటెస్టంట్స్ తో మరో గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో ఒక్కో కంటెస్టంట్ కి ఒక్కో పోస్టర్ ఇచ్చారు. శ్రీహాన్-దేశముదురు, ఫైమా-జాతిరత్నాలు, ఆదిరెడ్డి-బ్లఫ్ మాస్టర్, కీర్తి- చంద్రముఖి, ఇనయ,శ్రీహాన్, సూర్య - ఓ పిట్టకథ, రోహిత్ - మిస్టర్ పర్ ఫెక్ట్ పోస్టర్లు ఇచ్చారు.
ఆఖరికి శ్రీసత్య,ఆదిరెడ్డి సేవ్ అవగా, ఫైమా ఎలిమినేట్ అయింది. ఫైమా స్టేజిమీదకి వచ్చిన తర్వాత ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరితో ఫన్? ఎవరితో ఫ్రస్టేషన్? ఉంటుంది అని నాగార్జున అడిగాడు. దీనికి ఫైమా.. ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య, శ్రీహాన్, ఇనయా, రోహిత్‌లు ఫన్ కేటగిరిలో ఉంటారని, రేవంత్ మాత్రం ఫ్రస్టేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది.
ఫైమా వెళ్లిపోయే ముందు రేవంత్.. తను చేతిపై ఎవరినీ ముద్దుపెట్టుకోనివ్వదని, చక్కిలిగిలి పుడుతుందని చెప్పడంతో.. నాగార్జున ఫైమా చేతికి కిస్ ఇచ్చాడు. దాంతో హౌస్ మేట్స్ షాకయ్యారు. ఫైమా ఎలిమినేట్ అవగా ఏడుగురు ఉన్నారు. ఈ ఏడుగురిలో శ్రీహాన్ ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. అంటే మిగతా ఆరుగురిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
Next Story