Mon Dec 23 2024 03:54:01 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ 6 విన్నర్ ఎవరో చెప్పేసిన గూగుల్ తల్లి.. అదే నిజమవుతుందా ?
బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ఆదిరెడ్డికి ఓట్లు తక్కువొచ్చనా.. కావాలని అతడిని విన్నర్ ను చేసేందుకు ప్రయత్నిస్తోందన్న..
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లతో పాటు ఓటీటీ పూర్తయింది. మరో మూడ్రోజుల్లో ఆరవ సీజన్ కూడా పూర్తికానుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఇంటి సభ్యులున్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీసత్య ఎలిమినేట్ అవుతుందని ఇప్పటికే లీకైనా.. గురువారం నాటి ఎపిసోడ్ లో కూడా అది టెలీకాస్ట్ చేయలేదు. బహుశా ఈరోజో, రేపో శ్రీసత్య ఎలిమినేషన్ ఉండొచ్చు. ఇక విన్నర్ విషయానికొస్తే.. సీజన్ ఆరంభమైనపుడు బాలాదిత్య విన్ అవుతాడని అనుకున్నారు. ఆ తర్వాత శ్రీహాన్, రేవంత్ లలో ఎవరో ఒకరు కావొచ్చని భావించారు ఆడియన్స్.
కానీ మధ్యలో.. బిగ్ బాస్ మేనేజ్ మెంట్ ఆదిరెడ్డికి ఓట్లు తక్కువొచ్చనా.. కావాలని అతడిని విన్నర్ ను చేసేందుకు ప్రయత్నిస్తోందన్న గాసిప్స్ వినిపించాయి. దాంతో బిబి మేనేజ్ మెంట్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు మరో వార్త వచ్చింది. ఇక రేవంతే విన్నర్ అవుతాడనుకుంటుంటే.. గూగుల్ తల్లి మరొకరి పేరును విన్నర్ గా చూపిస్తోంది. ఇప్పుడిదే నెట్టింట వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 4 లోనూ గూగుల్ గ్రాండ్ ఫినాలేకి ముందు ఇలాగే చూపించింది. అప్పుడు అభిజిత్ విన్ అవుతాడని చెప్పగా.. అతడే విన్నర్ అయ్యాడు. ఇప్పుడు గూగుల్ లో who is the winner of biggboss season 6 telugu అని టైప్ చేసి సెర్చ్ చేస్తే.. రోహిత్ పేరు చూపిస్తోంది.
నిజానికి రోహిత్ హౌస్ లో ఎలా ఆడాడో.. బిగ్ బాస్ సరిగ్గా టెలీకాస్ట్ చేయలేదన్న వాదన ఉంది. భార్యతో జంటగా వచ్చిన రోహిత్.. కొన్నివారాల తర్వాత విడివిడిగా ఆడారు. మెరీనా ఎలిమినేషన్ తర్వాత.. రోహిత్ నిజంగా అందరితో ఎలా ఉంటాడో తెలిసింది. మిస్టర్ కూల్ గా రోహిత్ కు పేరొచ్చింది. అతనికి ఓటింగ్ ఎక్కువగా ఉన్నా ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తుందని కొందరు లీక్ చేయడంతో.. ఓటింగ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఉన్న లిస్టును బట్టి చూస్తే.. టాప్ ఓటింగ్ లో రేవంత్ ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీహాన్, రోహిత్ ఉన్నారు. కీర్తి, ఆదిరెడ్డి 4,5 స్థానాల్లో ఉన్నారు.
మరి నిజంగా గూగుల్ చెప్పినట్లు రోహితే విన్నర్ అవుతాడా ? లేక వేరొకరిని విన్నర్ ని చేస్తారా తెలియాలంటే.. రెండ్రోజులు ఆగాల్సిందే.
Next Story