Sun Dec 22 2024 12:27:33 GMT+0000 (Coordinated Universal Time)
మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది వీరేనా?
హౌస్ లో. రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ లు ఉన్నారు. వీరిలో మిడ్ వీక్ ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. సరైన వారిని ఎంపిక చేయకపోవడం వల్లనే వ్యూయర్ షిప్ తగ్గిందన్న విమర్శలు కూడా తొలి నుంచి వినిపిస్తున్నాయి. వీకెండ్ లో కూడా బిగ్ బాస్ షోకు రేటింగ్ రావడం లేదు. దీంతో టీం నిరాశకు గురయింది. అందుకే పెద్దగా ఖర్చులేని వారిని హౌస్ లో ఉంచి, బాగా ఆడుతున్న వారిని పంపించేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
ఇనయా ఎలిమినేట్...
బిగ్బాస్ నుంచి ఇనయా ఎలిమినేట్ అయింది. ఇనాయ స్క్రీన్ స్పేస్ ఎక్కువగానే తీసుకుంటుంది. ఆమె టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్ బాస్ టీం ఆమెను ఎలిమినేట్ చేసింది. ఇక హౌస్ లో ఆరుగురు మెంబర్స్ ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ లు ప్రస్తుతం ఉన్నారు. వీరిలో మిడ్ వీక్ ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
ఆరుగురిలో...
ఈ విషయాన్ని ఇప్పటికే నాగార్జున ప్రకటించారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా రోహిత్, కీర్తిలు హౌస్ లోనే కొనసాగుతున్నారు. వారిని ఎందుకు హౌస్ లో ఉంచారో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. కీర్తి, రోహిత్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సీజన్ లో మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతామని ఊహించలేం. బిగ్బాస్ సీజన్ 6 వచ్చే వారంతో ముగియనుంది.
Next Story