Mon Dec 23 2024 18:24:44 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ స్టేజిపై ఎవర్నో ఉద్దేశించి ఆ మాట అనలేదు : నాగార్జున
తాజాగా టెలీకాస్ట్ అయిన వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కపుల్ ని హగ్ చేసుకోమని చెప్పి, వాళ్లిద్దరూ పెళ్లైన వాళ్లు..
టాలీవుడ్ హీరో నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. టీవీ షో లు, సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున.. ఆరుపదులు నిండినా నవ మన్మథుడిగా కనిపిస్తూ.. ప్రేక్షకులని అలరిస్తున్నారు. బ్రహ్మాస్త్రలో గెస్ట్ పాత్రలో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు మన టాలీవుడ్ కింగ్. త్వరలోనే ఆయన ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా.. బ్రహ్మాస్త్ర సక్సెస్ మీట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. తన వందో సినిమా, బాయ్ కాట్ ట్రెండ్, కొత్త కథలు, వెబ్ సిరీస్ లు, బిగ్ బాస్ ఇలా పలు అంశాలపై స్పందించారు.
బిగ్ బాస్ పై ఇటీవల కాలంలో సీపీఐ లీడర్ నారాయణ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై నాగార్జున ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా టెలీకాస్ట్ అయిన వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న కపుల్ ని హగ్ చేసుకోమని చెప్పి, వాళ్లిద్దరూ పెళ్లైన వాళ్లు నారాయణ..నారాయణ అన్నారు. నాగార్జున అలా అనడంతో సీపీఐ లీడర్ నారాయణ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ అనుకున్నారంతా. దానిపై నాగార్జున క్లారిటీ ఇచ్చారు.
"నేను ఎవరైనా జోక్ వేస్తే 'నారాయణ నారాయణ' అంటాను. మొన్న శనివారం ఎపిసోడ్లో కూడా కంటెస్టెంట్స్ ని నవ్వించడానికే అలా అన్నాను. బిగ్బాస్ లో గతంలో కూడా కొన్ని సార్లు ఆ మాట వాడాను. అంతే కానీ నేను ఎవర్నీ ఉద్దేశించి 'నారాయణ నారాయణ' అనలేదు" అని నాగార్జున స్పష్టం చేశారు. అలాగే బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. "బిగ్ బాస్ లో ఎవరు డ్రామా చేస్తున్నారు? ఎవరు గేమ్స్ ఆడుతున్నారు? అని విశ్లేషిస్తుంటే నాకు లైఫ్ లెసెన్స్లా అనిపిస్తోంది. మన కుటుంబాన్ని వదిలేసి, వందల కెమెరాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య అన్ని రోజులు గడపడం అనేది చిన్న విషయం కాదు. నేను హోస్ట్ గా చేస్తాను కానీ, పార్టిసిపెంట్ గా మాత్రం బిగ్బాస్ లోకి వెళ్ళను, వెళ్ళలేను" అని తెలిపారు.
Next Story