Thu Dec 26 2024 17:54:08 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ న్యూ ప్రోమో : ఎమోషన్ తో నిండిపోయిన హౌస్.. అందరూ ఏడ్చేశారు
డు టెలీకాస్ట్ కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో బిగ్ బాస్.. అందరినీ ఏడిపించేశాడు. రెండ్రోజుల పాటు..
బిగ్ బాస్ సీజన్ 6 రెండవ వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. నామినేషన్స్ లో 8 మంది ఉండగా.. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారో ఎవరూ గెస్ చేయలేకపోతున్నారు. ఎలిమినేషన్ లో ఉన్నవారంతా స్ట్రాంగ్ కంటెస్టంట్స్ అవ్వడమే అందుకు కారణం. ఇక.. నేడు టెలీకాస్ట్ కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో బిగ్ బాస్.. అందరినీ ఏడిపించేశాడు. రెండ్రోజుల పాటు బేబీలను ఆడించి, లాలించిన ఇంటిసభ్యులు.. తమకు తమ పర్సనల్ లైఫ్ లో పిల్లలతో ఉన్న అటాచ్ మెంట్ గురించి ఇంటిసభ్యులతో పంచుకోవాలని చెప్పాడు.
బిగ్ బాస్ ఆదేశం మేరకు.. అందరూ పిల్లలతో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ.. ఏడ్చి.. ఏడిపించారు. సుదీప 2015లో తన బేబీని కోల్పోయానని, తమ చెల్లి కూతుర్ని తిరిగివ్వడానికి మనసొప్పలేదని చెప్తూ.. ఎమోషనల్ అయింది. రేవంత్.. తనకు పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుతూ.. ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకుందామా అని వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. రోహిత్-మెరీనా.. తన బిడ్డను కడుపులోనే పోగొట్టుకున్నామని చెప్పి బోరుమన్నారు. చంటి తన తల్లిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కీర్తి, శ్రీ సత్య లు కూడా తమ అటాచ్ మెంట్ ని గుర్తుచేసుకున్నారు.
Next Story