బ్యాంకులు వరుసగా 4 రోజులు బంద్
ప్రతినెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు సెలవులు ఉన్నాయన్నది..
ప్రతినెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు సెలవులు ఉన్నాయన్నది కస్టమర్లు ముందస్తుగానే తెలుసుకుని బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు పడతారని గుర్తించుకోండి. అయితే దేశంలో పండగ సీజన్ కారణంగా పలు రాష్ట్రాల్లో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. విజయదశమి దుర్గా పూజ అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. దసరా పూజ అనేది దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో ఏదో ఒక రూపంలో జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ సీజన్‌తో పాటు సెలవుల సందడి కూడా ఉండడం సహజమే. ముఖ్యంగా దసరా సందర్భంగా బ్యాంకులకు భారీ సెలవులు రానున్నాయి. అయితే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, కార్యక్రమాలు, పండగల ప్రాముఖ్యతను బట్టి ఉంటుందని వినియోగదారులు గమనించాలి.
అక్టోబర్ లాంగ్ వీకెండ్ అంటూ దసరా పండుగ కావడంతో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. పండగ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు వరుసగా 4 రోజుల మూసి ఉండనున్నాయి. సాధారణంగా బ్యాంకులకు వారానికి ఒకటి లేదా రెండు రోజులు సెలవులు ఉంటాయి. నెలలో అన్ని ఆదివారాలు కాకుండా, రెండవ, నాల్గవ శనివారాలు కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ కారణంగా ప్రతి రెండవ వారానికి బ్యాంకులలో రెండు రోజుల వారాంతం ఉంటుంది.
అయితే ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండబోతోంది. చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 24 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అక్టోబరు 21వ తేదీ నెలలో మూడవ శనివారం, అయితే ఆ రోజు మహాసప్తమి కారణంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 21న త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 22 ఆదివారం అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
అక్టోబర్ 23, సోమవారం, విజయదశమి సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆ తర్వాత, అక్టోబర్ 24, మంగళవారం, దసరా రోజున దుర్గాపూజ సందర్భంగా త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. ఈ విధంగా మూడు రాష్ట్రాల్లో త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకుల పనితీరు ప్రభావితమవుతుంది. అయితే పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది.