Mon Dec 23 2024 19:58:44 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీహాన్ బర్త్ డే.. హౌస్ బయట టపాసులతో సిరి సెలబ్రేషన్స్
హౌస్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో పెద్ద మైక్ సెట్ ఏర్పాటు చేసి.. మైక్ లో సిరి, జెస్సి లు శ్రీహాన్ కు పుట్టినరోజు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో హౌస్ మేట్ గా ఉన్న శ్రీహాన్ బర్త్ డే నేడు. సాఫ్ట్ వేర్ బిచ్చగాడు షార్ట్ ఫిలిం తో శ్రీహాన్ కు ఫేమ్ వచ్చింది. శ్రీహాన్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ హౌస్ బయట సిరి, బిగ్ బాస్ 5 కంటెస్టంట్ జెస్సీ రచ్చ రచ్చ చేశారు. హౌస్ బయట టపాసులు పేల్చుతూ శ్రీహాన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.
హౌస్ కి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో పెద్ద మైక్ సెట్ ఏర్పాటు చేసి.. మైక్ లో సిరి, జెస్సి లు శ్రీహాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. హౌస్ బయట సిరి చేసిన శ్రీహాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. శ్రీహాన్ అభిమానులు అతనికి బర్త్ డే విషెస్ చెబుతూ.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.
Next Story