Mon Dec 23 2024 05:30:34 GMT+0000 (Coordinated Universal Time)
Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ను హోస్ట్ చేసేది ఆ హీరోయేనా ?
ఇక ఇనయ టాప్ 7 కంటెస్టంట్ అవగా.. 14వ వారం ఎలిమినేట్ అయింది. నిజానికి ఓటింగ్ ప్రకారం ఆ వారం ఎలిమినేట్ కావాల్సింది..
బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఈ సీజన్లో శ్రీహాన్ క్యాష్ ఆఫర్ ఎంచుకుని రన్నరైనా.. రేవంత్, శ్రీహాన్ ఇద్దరూ విన్నర్లుగా నిలిచారు. గత సీజన్లలో ఎన్నడూ లేనంత పేలవంగా సాగింది ఈ సీజన్. నాని హోస్ట్ చేసిన సీజన్ 2 కంటే ఘోరమైన టీఆర్పీ సీజన్ 6కి వచ్చింది. ఒక రకంగా డిజాస్టర్ అట్టర్ ఫ్లాప్ అయినట్లే. అసలు ఆడియన్స్ కి తెలియని ఆదిరెడ్డి టాప్ 4 వరకూ రావడం అందరికీ షాకింగ్ గానే అనిపించింది. ఈ సీజన్ లో కొందరిని కావాలని ఎలిమినేట్ చేశారని ఆడియన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. గీతూ, సూర్య, ఇనయ ల ఎలిమినేషన్ అన్ ఫెయిర్ గా ఉందని నెటిజన్లు వాళ్ల ఎలిమినేషన్ టైమ్ లో ట్రోల్ చేశారు.
ఇక ఇనయ టాప్ 7 కంటెస్టంట్ అవగా.. 14వ వారం ఎలిమినేట్ అయింది. నిజానికి ఓటింగ్ ప్రకారం ఆ వారం ఎలిమినేట్ కావాల్సింది ఆదిరెడ్డి అని, కావాలని ఇనయని ఎలిమినేట్ చేశారని పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇనయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ పై లక్ష ట్వీట్లు కూడా వేశారు. ఆడపులిలా అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా ఆడిన ఇనయ వాంటెడ్ ఎలిమినేషన్ నాగార్జునకు సైతం నచ్చలేదట. అందుకే తదుపరి సీజన్ నుండి ఆయన హోస్ట్ చేయను అన్నారని టాక్ వచ్చింది.
మరి నాగ్ ప్లేస్ లో.. ఆ రేంజ్ లో ఎవరు హోస్ట్ చేస్తారు ? బిగ్ బాస్ సీజన్ 1ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 2కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. సీజన్ 3,4,5, ఓటీటీ, సీజన్ 6 వరకూ కంటిన్యూ గా నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ హోస్టింగ్ పై నాగార్జున మార్క్ పడిపోయింది. కానీ.. తదుపరి హోస్ట్ చేయరనడంతో.. మళ్లీ ఎన్టీఆర్ వస్తారా ? అన్న వార్తలు గుప్పుమన్నాయి. హోస్ట్ గా వచ్చేది హీరోనే గానీ.. ఎన్టీఆర్ కాదు. దగ్గుబాటి హీరో రానా. బిగ్ బాస్ సీజన్ 7కి రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం. రానా ను తీసుకోవాలని నాగార్జునే సూచించినట్లు తెలుస్తోంది. ఇక మేనేజ్ మెంట్ అయితే బాలకృష్ణను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరు బిగ్ బాస్ 7 హోస్ట్ గా వస్తారో చూడాలి.
Next Story