Mon Jan 13 2025 02:44:57 GMT+0000 (Coordinated Universal Time)
మహిళలకు తీపి కబురు
ఈరోజు దేశంలో బంగారం ధరలు మాత్రం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 380 రూపాయలు తగ్గింది.
బంగారం అంటేనే మగువలకు అత్యంత ఇష్టమైన వస్తువు. దానిని సొంతం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తుంటారు. కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టుకునైనా పసిడిని తమ ఇంటికి తీసుకెళితే అందులో ఆనందమే వేరు. బంగారం మహిళలకు సొంతం. దానికి విలువతో సంబంధం లేకుండా, సీజన్ తో పని లేకుండా కొనుగోలు చేస్తుండటంతో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం కొనుగోళ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
ధరల పెరగడానికి...
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరిగాయన్నది నిపుణుల మాట. ఇక బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం అనేది జరగదని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రానున్న కాలంలో తులం బంగారం ధర అరవై ఐదు వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
భారీగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు మాత్రం భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 380 రూపాయలు తగ్గింది. వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గడం కొంత ఊరట కల్గించే అంశం. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 54,500 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,450 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 77,000 ట్రెండ్ అవుతుంది.
Next Story