Mon Dec 23 2024 03:11:58 GMT+0000 (Coordinated Universal Time)
Ambassador Car : ఈ కారు ఖరీదు.. కరెంటు బిల్లుకంటే తక్కువే.. ఎప్పుడంటే
అంబాసిడర్ కారు అంటే అదోక ప్రిస్టేజి. ఆ కారులో ప్రయాణం హాయిగా సాగేది.
ఓల్డ్ జనరేషన్ కు తెలిసిన కారు ఇది. అంటే 1990వ దశకంలో ఈ కారు ఉంటే చాలు అని అనుకునే వారు. అంబాసిడర్ కారు అంటే అదోక ప్రిస్టేజి. ఆ కారులో ప్రయాణం హాయిగా సాగేది. రోడ్లు నాడు సక్రమంగా లేకపోయినా సింగిల్ రోడ్లలోనైనా వేగంగా దూసుకెళ్లేవి. రాజకీయ నేతల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ అంబాసిడర్ కార్లను ఎక్కువగా ఉపయోగించేవారు. దూరప్రయాణాలకు కూడా దీనిని వాడేవారు. ఒక కుటుంబం సౌకర్యవంతంగా ఈ అంబాసిడర్ కారులో ప్రయాణించే వీలుండేది. అందుకే సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా ఎక్కువ మంది అంబాసిడర్ కార్లను వినియోగించేవారు. మద్రాస్ రోడ్లపై ఇవి తిరుగుతుండేవి. ఇక అద్దె కార్లగా కూడా ఎక్కువగా కన్పించేవి.
నాటి జనరేషన్ వాళ్లు...
ముందుభాగాన డ్రైవర్ తో పాటు ఇద్దరు, వెనక భాగాన ముగ్గురు కూర్చుని సుఖవంతమైన ప్రయాణం చేసే వారు. వెనక లగేజీ కూడా పెట్టుకునేందుకు స్సేస్ కావాల్సినంత ఉండేది. అప్పట్లో ఫియట్ వంటి కంపెనీల కార్లున్నా ఎక్కువగా రోడ్లమీద కన్పించేది ఈ కార్లు మాత్రమే. ఎక్కువ మైలేజీతో పాటు తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేసుకునే వీలుండటంతో ఎక్కువ మంది అంబాసిడర్ కార్లను కొనుగోలు చేేసే వారు. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పాత అంబాసిడర్ కార్లను రోడ్లపైకి తిప్పుతూ వింటేజ్ కార్ల తరహాలో అందరికీ చూపిస్తారు. అవును ఆ కారులో ఏసీతో పాటు వేగంగా ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఇష్టపడి అంబాసిడర్ ను కొనుగోలు చేసే వారు.
మూసివేయడంతో...
కానీ 1964లో ఆ కారు ధర ఎంతో తెలుసా? కేవలం 16,495 రూపాయలు. అవును ఇది నిజం. ఇప్పుడు ఒక మోస్తరు ఇంటికి వేసవిలో వచ్చే కరెంట్ బిల్లు అంత. నమ్మినా నమ్మకపోయినా అంతే. అయితే ఈ కారుకు సంబంధించిన ఇన్వాయిస్ బిల్ ఒకటి బయటకు వచ్చింది. మద్రాస్ కు చెందిన గుప్తాస్ కు చెందిన ఈ కారును 16,495 రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్ లో పేర్కొన్నారు. అయితే వీటి ఉత్పత్తిని హిందూస్థాన్ మోటార్స్ రెండు దశాబ్దాల క్రితం ఆపేసింది. ఇప్పుడు ఆటో గేర్లు, అంతకంటే సౌకర్యవంతమైన కార్లు వివిధ రంగుల్లో వస్తుండటంతో ఈ కార్ల తయారీని ఆపేశారు. అయినా సరే నాటి జనరేషన్ కు మాత్రం అంబాసిడర్ కారు గుర్తుండి ఉంటుంది. కారు 2014 నాటికి నాలుగు లక్షల రూపాయలకు చివరిసారిగా అమ్మినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story