పట్టాలెక్కనున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..
Amrit Bharat Express: హైస్పీడ్ రైలు వందే భారత్ తర్వాత, ఇప్పుడు దేశం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. ఇవి..
Amrit Bharat Express: హైస్పీడ్ రైలు వందే భారత్ తర్వాత, ఇప్పుడు దేశం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాబోతోంది. ఇవి బీహార్‌లోని దర్భంగా నగరం - పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నగరం నుంచి ప్రారంభమవుతాయి. మొదటి అమృత్ భారత్ బీహార్ నుంచి దర్భంగా నుండి ఢిల్లీకి వస్తుంది. రెండవ రైలు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి బెంగళూరుకు వెళ్తుంది. ఈ అమృత్ భారత్ రైలులో ఉపయోగించబడిన పుష్-పుల్ టెక్నాలజీ కూడా ఉంది. దీని గురించి తెలుసుకుందాం.
వందే భారత్ తర్వాత అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పుష్-పుల్ టెక్నాలజీతో రూపొందించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ఈ రైలు ప్రత్యేకత. డిసెంబర్ 30న ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలులో ఏర్పాటు చేసిన పుష్-పుల్ టెక్నాలజీ ఏమిటి ? దాని వల్ల ప్రయోజనం ఏంటన్నది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.
పుష్-పుల్ టెక్నాలజీ అంటే ఏమిటి?
ఈ సాంకేతికతతో కూడిన రైలులో రెండు ఇంజన్లు ఉంటాయి. సరళమైన భాషలో అర్థం చేసుకోవాలంటే.. ఒక ఇంజిన్ పుష్ పని చేస్తుంది. అలాగే మరొకటి లాగడం చేస్తుంది. రైలు ప్రారంభంలో అమర్చిన ఇంజిన్ మొత్తం రైలును లాగడానికి పని చేస్తుంది. వెనుక భాగంలో అమర్చబడిన ఇంజిన్ మొత్తం రైలును నెట్టివేస్తుంది. తద్వారా అది అధిక వేగాన్ని చేరుకోగలదు. దీంతో రైలు వేగంగా వేగం పుంజుకుంటుంది. ఇంతకుముందు వందే భారత్ రైలులో ఈ సాంకేతికతను ఉపయోగించారు. శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కంటే పుష్పుల్ టెక్నాలజీతో కూడిన రైళ్ల వేగం ఎక్కువని చెప్పడానికి కారణం ఇదే. ఇప్పుడు అమృత్ భారత్ కూడా అదే స్పీడ్ అందుకోనుంది.
మీడియా కథనాల ప్రకారం.. ఇందులో కంపార్ట్మెంట్లు ఉండవు. ఈ రైలులో సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. వాటి ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలను కలుపుతూ అందుబాటులోకి రానుంది.
అమత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 బోగీలు ఉంటాయి. ఇందులో ఏసీ కోచ్‌లకు బదులుగా అన్ని కోచ్‌లు స్లీపర్, జనరల్ కోచ్‌లుగా ఉంటాయి. ఇది చాలా ఆధునికంగా రూపొందించబడినప్పటికీజ. దీని బోగీల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఆధునిక మరుగుదొడ్లు ఉంటాయి. ఇది కాకుండా, సెన్సార్లతో కూడిన నీటి కుళాయిలను కలిగి ఉంటుంది. రైలు బోగీలు భద్రతా కోణం నుండి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇది LHB మోడల్. ఈ రైలు వేగం రాజధాని, శతాబ్దితో పోటీ పడనుంది. ఇది గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.