ఐఫోన్ 16లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
యాపిల్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతా ఇంతా కాదు. యాపిల్ ఐఫోన్.. ఈ ఫోన్ గురించి..
యాపిల్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అంతా ఇంతా కాదు. యాపిల్ ఐఫోన్.. ఈ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే పని లేదు. యాపిల్ నుంచి ఏదైనా కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తుంటారు. ఇక వినియోగదారులు అనుకున్నదానికంటే అద్భుతమైన ఫీచర్స్‌తో ఐఫోన్లను విడుదల చేస్తుంటుంది కంపెనీ. ఈ నేపథ్యంలో ఐఫోన్-16 సిరీస్‌పై అందరి దృష్టి పడుతోంది. ఓ అద్భుతమైన ఫీచర్‌తో ఈ ఫోన్ రానుందని వినికిడి.
ఈ సంవత్సరం చివరలో ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు టెక్ వర్గాల ద్వారా సమాచారం. ఈ ఫోన్లో ఓ ఆసక్తికరమైన ఫీచర్ ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ అండర్ వాటర్ మోడ్ అనే ఓ అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్‌లో పేటెంట్లో అండర్ వాటర్ మోడ్ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోగా, ఈ అండర్ వాటర్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు నీటి లోతులో కూడా ఫోన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు. కేవలం ఆపరేట్ మాత్రమే కాకుండా.. నీటి అడుగు భాగంలో కూడా మంచి క్లారిటీతో కూడిన ఫొటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. నీటి అడుగు భాగంలో ఫోన్ టచ్ పనిచేయదు కాబట్టి, కెమెరా ఆపరేటింగ్‌కు ప్రత్యేక బటన్‌ను ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.