Tue Nov 05 2024 07:50:03 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price : ఏందో మనం వింటున్నది నిజమేనా.. ధరలు ఇలా ఉన్నాయా? ఎప్పుడైనా?
రెండు రోజులుగా బంగారం ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు ఇక క్యూ కట్టే అవకాశాలున్నాయి.
పసిడి ధరలకు ఎప్పుడూ రెక్కలు ఉంటాయి. ధరలు పెరుగుతూనే ఉంటాయి. తగ్గుదల అనేది ఉండదు. కానీ గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండటం ఈ సీజన్ లో కొంత ఊరట కల్గించే అంశమే. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ మరో రెండు నెలల పాటు ఉండటంతో బంగారం ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగడం ఒకరకంగా గుడ్ న్యూస్ కదా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. నూతన ఏడాది ఆరంభంలో పసిడి ప్రియులకు నిలకడగా కొనసాగుతున్న ధరలు మరింత ఊపు నిస్తున్నాయి.
కొద్ది రోజులుగా...
గత కొద్దిరోజులుగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోళ్లు కూడా బాగా తగ్గాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతండటంతో తాము కొనలేని పరిస్థితులకు పసిడి చేరుకోవడంతో ఎవరూ గోల్డ్ ను సొంతం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేవలం పెళ్లిళ్లకు అవసరమైన కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా చెబుతున్నారు.
ధరలు ఇలా...
గత రెండు రోజులుగా ధరలు పెరగకుండా స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు ఇక క్యూ కట్టే అవకాశాలున్నాయన్న అంచనాలున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,000 రూపాయలు వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,270 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర 78,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story