నెలకు రూ.210తో రూ.5 వేల పెన్షన్.. పూర్తి వివరాలు
మోడీ సర్కార్ దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులు, మహిళలు, చిన్నవ్యాపారులు ఇలా రకరకాల పథకాలను..
మోడీ సర్కార్ దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులు, మహిళలు, చిన్నవ్యాపారులు ఇలా రకరకాల పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు కూడా మోడీ సర్కార్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్‌లో చేరినట్లయితే 60 ఏళ్ల తర్వాత మీకు ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందవచ్చు. ఆ సమయంలో మీకు ఎవరి సహాయం అవసరం లేకుండా కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ డబ్బులతో గడపవచ్చు. పదవీ విరమణ తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నెలవారీ పెన్షన్ వచ్చేలా మీరు ముందుగానే ఆర్థిక ప్రణాళికను ప్రారంభించాలి. ఈ పెన్షన్ పథకాల్లో సాయం అందించేది అటల్ పెన్షన్ యోజన పథకం.
అటల్ పెన్షన్ యోజన అంటే ఏమిటి?
ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు అర్హులు. తక్కువ ఆదాయ వర్గ వ్యక్తుల పదవీ విరమణ జీవితానికి ఆధారాన్ని అందించడానికి రూపొందించబడిన పథకం ఇది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకంలో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.
నెలకు రూ.5 వేల పెన్షన్ ఎలా పొందాలి?
అటల్ పెన్షన్ యోజన పొందేందుకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. మీరు ఆ వయస్సులో పథకాన్ని పొందినట్లయితే మీరు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు రూ.1,454 చెల్లిస్తే నెలవారీ రూ.5,000 పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రూ.1000 నెలవారీ పెన్షన్ కావాలంటే నెలకు రూ.291 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే18 ఏళ్ల నుంచి ఈ పథకంలో డిపాజిట్ చేస్తే నెలకు రూ.210 చెల్లిస్తే రూ.5,000 నెలవారీ పెన్షన్ పొందవచ్చు.
ఎలాంటి అర్హతలు ఉండాలి..?
18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌ను పొందవచ్చు. అయితే, వారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అలాగే పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.