Bank Holiday: కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజుల సెవులు
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలు జరిపేవారు ప్రతి నెల రాగానే ఏయే రోజుల్లో..
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలు జరిపేవారు ప్రతి నెల రాగానే ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయోన్న విషయాన్ని ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ప్రతినెల సెలవు జాబితాను విడుదల చేస్తుంటుంది. డిసెంబర్ నెలలో మొత్తం 18 రోజులపాటు బ్యాంకులు మూసి ఉండటనున్నాయి. అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి మూసి ఉంటాయని గమనించండి. ఇందులో ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి ఉన్నాయి.
డిసెంబర్లో బ్యాంకులకు సెలవుల జాబితా:
☛ డిసెంబర్ 1 - రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
☛ డిసెంబర్ 3 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 4 - సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫెస్టివల్ కారణంగా గోవాలో బ్యాంకులు పని చేయవు
☛ డిసెంబర్ 9 - రెండో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 10 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 12 - ప-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులను మూసివేస్తారు
☛ డిసెంబర్ 13, 14 - లోసంగ్/నామ్సంగ్ కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే
☛ డిసెంబర్ 17 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 18 - యు సోసో థామ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
☛ డిసెంబర్ 19 - విమోచన దినోత్సవం కారణంగా గోవాలో బ్యాంకులకు హాలిడే
☛ డిసెంబర్ 23 - నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 24 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 25 - క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
☛ డిసెంబర్ 26 - క్రిస్మస్ వేడుకల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయలో బ్యాంకులకు హాలిడే
☛ డిసెంబర్ 27 - క్రిస్మస్ వేడుకల కారణంగా నాగాలాండ్‌లో బ్యాంకులు పని చేయవు
☛ డిసెంబర్ 30 - యు కియాంగ్ నంగ్బా దృష్ట్యా మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి
☛ డిసెంబర్ 31 - ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
ఇదిలా ఉంటే బ్యాంకులకు సెలవులు ఉన్నా.. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు యధావిథిగా పనిచేస్తాయి. ఆన్లైన్ సేవల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఏటీఎమ్‌ల ద్వారా క్యాష్ విత్‌డ్రాతో పాటు డిపాజిట్ మిషన్‌తో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. సెలవుల రోజుల్లో వీటికి ఎలాంటి ఆటంకం ఉండదు.