January Bank Holidays: వచ్చే నెలలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు
Bank Holidays In January 2024: మరికొన్ని రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. కొత్త సంవత్సరం రానుంది. అయితే నెల దగ్గర పడుతుండటంతే బ్యాంకు
Bank Holidays In January 2024: మరికొన్ని రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. కొత్త సంవత్సరం రానుంది. అయితే నెల దగ్గర పడుతుండటంతే బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తం కావాలి. ఎందుకంటే బ్యాంకు పనులు చేసుకునేవారు నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అలాగే వచ్చే నెల జరివరి నెలలో రెండో, నాలుగో శనివారాలతో కలిపి మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పనిచేయావని ఆర్బీఐ తెలిపింది. ఆ బ్యాంకు హాలిడేస్ వివరాలు చూద్దాం.
➦ జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు.
➦ జనవరి 7వ తేదీ ఆదివారం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
➦ జనవరి 11వ తేదీ మిషనరీ డే సందర్భంగా మిజోరంలో బ్యాంకులకు సెలవు
➦ ఇక జనవరి 12వ తేదీ శుక్రవారం.. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బంగాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
➦ జనవరి 13వ తేదీ రెండో శనివారం. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
➦ జనవరి 14వ తేదీ ఆదివారం (సంక్రాంతి) దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
➦ జనవరి 15వ తేదీ సోమవారం రోజున పొంగల్, తిరువళ్లూర్ డే సందర్భంగా ఏపీతో పాటు తమిళనాడులో బ్యాంకులకు సెలవు.
➦ జనవరి 16 వతేదీ మంగళవారం తుసు పూజ సందర్భంగా బంగాల్, అసోంలో హాలిడే
➦ జనవరి 17వ తేదీన బుధవారం గురుగోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
➦ జనవరి 21వ తేదీన ఆదివారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
➦ జనవరి 23వ తేదీ మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవు
➦ జనవరి 25వ తేదీ గురువారం హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డే సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
➦ జనవరి 26వ తేదీ శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
➦ జవనరి 27వ తేదీ నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
➦ జనవరి 28వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
➦ ఇక జనవరి 31వ తేదీ బుధవారం మిడామ్ మే ఫి సందర్భంగా అసోంలో బ్యాంకులకు సెలవు
గమనిక: ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ సెలవులు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించండి.