Mon Dec 23 2024 19:31:28 GMT+0000 (Coordinated Universal Time)
TATA CARS: టాటా కార్లపై 3 లక్షల రూపాయల భారీ డిస్కౌంట్
టాటా మోటార్స్ Nexon EV, PUNCH EV, Tiago EV ధరలను
పండుగ సీజన్లో తమ విక్రయాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ Nexon EV, PUNCH EV, Tiago EV ధరలను రూ. 3 లక్షల వరకు తగ్గించింది. టాటా కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఉంది. టాటా కంపెనీ FY24లో దాదాపు 74% మార్కెట్ వాటాతో 74,000 యూనిట్లను విక్రయించింది.
Nexon EVలో భాగంగా ఓ వేరియంట్ కు దాదాపు రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించగా, పంచ్ EVకి రూ. 1.20 లక్షలు, టియాగో EVకి రూ. 40,000 వరకు ధర తగ్గింపు లభించింది. Nexon EV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కారు. ఈ ఆఫర్ Nexon EV, పంచ్ EV బేస్ వేరియంట్ల ధరలను ప్రభావితం చేసింది. ఎంట్రీ-లెవల్ Nexon EV ఇప్పుడు రూ. 12.49 లక్షలకు అందుబాటులో ఉండగా, ఎంట్రీ-లెవల్ పంచ్ EVని రూ. 9.99 లక్షలకు పొందవచ్చు. ఇంతకుముందు, Nexon EV, పంచ్ EV బేస్ వేరియంట్లు రూ. 14.49 లక్షలు, రూ. 10.99 లక్షలుగా ఉన్నాయి. కంపెనీ తన EV కస్టమర్లకు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో ఆరు నెలల ఉచిత ఛార్జింగ్ ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది.దేశవ్యాప్తంగా 5,500 టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు ఉంటాయని టాటా కంపెనీ తెలిపింది.
Next Story