Sun Mar 30 2025 06:44:46 GMT+0000 (Coordinated Universal Time)
Bajaj Chetak : మళ్లీ రోడ్లపైకి బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ కొత్త రూపు సంతరించుకుని మళ్లీ మార్కెట్ లోకి వస్తుందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి

బజాజ్ చేతక్ కొత్త రూపు సంతరించుకుని మళ్లీ మార్కెట్ లోకి వస్తుందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బజాజ్ చేతక్ కనిపించని రోడ్డు ఉండేది కాదు. స్కూటర్లలో రారాజు. ఇప్పటికీ పాత బజాజ్ చేతక్ బండ్లు కనిపిస్తూనే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా పాలు పోసే వారు ఈ బజాజ్ చేతక్ నే ఉపయోగిస్తుండటం చూస్తుంటాం.
నాడు ఎక్కడ చూసినా...
1970వ దశకం నుంచి రెండు వేల వరకూ ఈ బజాజ్ చేతక్ స్కూటర్లు ఎక్కువగానే అమ్ముడుపోయాయి. స్టయిలిష్ గా ఉండటమే కాకుండా ఫ్యామిలీ వెహికల్ గా దీనికి పేరుంది. అయితే కొన్నాళ్ల నుంచి దీనిని కంపెనీ తయారీని ఆపేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది కొత్త రూపుతో బజాజ్ చేతక్ మార్కెట్ లోకి విడుదలవుతుందని చెబుతున్నారు. మరోసారి ఇండియన్ మార్కెట్ ను ఈ బజాజ్ చేతక్ శాసిస్తుందా? లేదా? అన్నది మాత్రం వేచి చూడాల్సింది.
Next Story