Mon Dec 23 2024 03:36:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సుదీర్ఘకాలం తర్వాత ఎస్బీఐ ఛైర్మన్ గా తెలుగు బిడ్డ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియమితులయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాల అనంతరం తెలుగు వ్యక్తికి ఈ పదవి దక్కింది. బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా తెలంగాణ వ్యక్తి నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ మేరకు చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఆర్థిక సేవల సంస్థల బ్యూరో సిఫార్సు చేసింది. ప్రస్తుత ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఈ ఏడాది ఆగస్టు 28 పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో ఎస్బీఐ ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి ను నియమించింది.
పాలమూరుకు చెందిన...
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గల కమిటీ ఈ పేరును ఖరారు చేసింది. చల్లా శ్రీనివాసులు శెట్టి ఆగస్టు 30వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారని చెబుతున్నారు. గడచిన సంవత్సరంలో ఆయన బేసిక్ శాలరీ 26.3 లక్షలు.. దీనికి తోడు డీఎ కింద 9.7 లక్షలు అదనంగా లభించాయి. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మానవపాడు మండలం పెద్ద పోతులపాడుకు చెందిన ఆయన విద్యాభ్యాసం గద్వల్ లోనే సాగింది. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఏ చేశారు. 1988లో ఎస్బీఐ లో ప్రొబెషినరీ ఆఫీసర్ గా ప్రారంభమైన ఆయన ఉద్యోగ జీవితం అంచెలంచెలుగా ఎదిగి నేడు ఎస్బీఐ ఛైర్మన్ స్థాయికి చేరుకోవడం విశేషం.
Next Story