ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్విచ్ ఆఫ్ చేయలేడు
ఈ రోజుల్లో ఫోన్ ఉండని వ్యక్తి అంటూ ఉండరేమో. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లను వాడేస్తున్నారు..
ఈ రోజుల్లో ఫోన్ ఉండని వ్యక్తి అంటూ ఉండరేమో. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్లను వాడేస్తున్నారు. వృద్దులు సైతం ఫోన్లో ఫోన్ లేనిది ఉండటం లేదు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్లో పోగొట్టుకోవడం, దొంగిలించడం లాంటివాకి కూడా చాలా పెరిగిపోయాయి. ఎవరైనా స్మార్ట్ ఫోన్ పోగొట్టుకోగానే ముందుగా దొంగ చేసేపని ఏంటో తెలుసా...? ఇది మాత్రం తెలియదా..? వెంటనే స్విచ్ఛాఫ్ చేసేస్తాడనే సమాధానం మీ నుంచి వస్తుంది. ఫోన్లో ఉన్న సిమ్‌ను కార్డును తీసేసి ఎంచక్క దొంగ ఫోన్ వాడుకుంటాడు.. లేదా తక్కువ ధరల్లో అమ్మేసుకుంటాడు. ఈ రోజుల్లో ఫోన్ పోయింది అంటే ఆశలు వదులుకోవాల్సిందే. ఏంటి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెతికిస్తారు కదా..?
అలాగే ఫోన్‌ను ట్రాక్ చేసేందుకు వీలుంటుందని కదా అనేది చాలా మందిలో ఉంటుంది. కానీ పోయిన ఫోన్ తిరిగి రాబట్టుకోవాలంటే అది జరగని పని. అది మరీ కాస్లీ ఫోన్ ఉంటే అది కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి వారు పట్టించుకుంటే అది దొరికే అవకాశం ఉంటుంది. లేకుంటే లేదు. ఇక అసలు విషయానికొస్తే దొంగిలించిన ఫోన్‌ను వెంటనే స్విచ్ఛాఫ్ చేసేస్తాడు. అయితే ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ కాదని టెక్ నిపుణులు చెబుతున్నమాట. వారు తెలిపిన సెట్టింగ్స్ వివరాలను మీకందిస్తున్నాము.
పోయిన ఫోన్ స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే ఈ సెట్టంగ్స్ మార్చండి. ముందుగా మీ స్మార్ట్ ఫోన్లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే తర్వాత రిక్వైడ్ పాస్వర్డ్ టూ పవర్ ఆఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఆన్ చేయండి. పైన ఉన్న ఫైండ్ మై డివైజ్ కూడా ఆన్ చేయండి. పాస్వర్డ్ లేనిది ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు.
అయితే ఒకోసారి హడావుడి లో మొబైల్ ఫోన్లను మర్చిపోతూ ఉంటారు. మరికొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఫోను వేరే వాళ్ళు దొంగలిస్తుంటారు. ఎవరైనా ఫోన్ దొంగలించిన వెంటనే ముందుగా స్విచ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి ఈ సెట్టింగ్స్ మార్చుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుంది.