Aadhaar: ఆధార్ కార్డ్‌లో పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు!
Aadhaar Update: ఆధార్.. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. సిమ్‌కార్డు
Aadhaar Update: ఆధార్.. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. సిమ్‌కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ వరకు అన్నింటికి ఆధార్ తప్పనిసరి. ఏదైనా అప్డేట్ చేసుకోవాలన్నా ఆధార్ కావాల్సిందే. అయితే ఆధార్ కార్డులో ఏ వివరాలను ఎన్ని సార్లు మార్చుకునే అవకాశం ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ ఆధార్ అప్డేట్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
➦ ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మార్చుకోవడం కుదరదని గుర్తించుకోండి. కేవలం ఒక్కసారి మాత్రమే పేరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరైన కారణం పేరు మార్చుకునే పరిస్థితి వస్తే అప్పుడు మినహాయింపు ఇస్తారు. ఒకవేళ రెండోసారి పుట్టిన తేదీని మార్చాల్సి వస్తే.. యూఐడీఏఐ జాబితా ప్రకారం చెల్లుబాటు అయ్యే రుజువుతో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. అలాగే ఏవైనా సందేహాలు ఉంటే స్థానికంగా ఉన్న ఆధార్ సెంటర్ లేదా 1947 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి.
➦ ఇక ఆధార్ కార్డులో ఫొటోను ఎన్నిసార్లు అయినా మార్చుకునేందుకు అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న ఆధార్ ఎన్రోల్ సెంటర్‌కు వెళ్లి మీ ఫొటో, వేలి ముద్రలు వంటి వాటి ఆధారంగా ఫొటోలను మార్చుకోవచ్చు.
➦ ఇక ఆధార్ కార్డులో చిరునామా ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. అడ్రస్ మార్పునకు ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ సెంటర్లో సంబంధించిన డాక్యుమెంట్స్‌ని అందించి మార్చుకోవచ్చు.
➦ ఆధార్ కార్డులో జెండర్‌ను ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం, అవసరమైన డాక్యుమెంట్స్‌ను అందించడం ద్వారా జెండర్ అప్డేట్ను మరోసారి అప్డేట్ చేసుకోవచ్చు.
➦ అయితే ఆధార్‌లో ఈ మార్పులు చేసుకోవాలంటే కావాల్సిన పత్రాలు పాస్‌పోర్ట్, కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ, రెగ్యులేటరీ బోర్డు జారీ చేసిన సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫ్రీడం ఫైటర్ ఫోటో ఐడెంటిటీ కార్డు, టెన్త్ సర్టిఫికెట్, టాన్స్‌జెండర్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికేట్ వంటి సర్టిఫికెట్స్.