Aadhaar: గుడ్న్యూస్.. ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ అప్డేట్ చేసుకునే
ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయితే వెంటనే వివరాలను అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. తర్వాత అయితే రుసుము చెల్లించి అప్డేట్ చేసుకోవాలని గతంలో సూచించింది. కానీ తాజాగా ఆ గడువును మరోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి వచ్చే ఏడాది అంటే 2024, మార్చి 14 తేదీ వరకు పొడిగించింది UIDAI.
ఆధార్ కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేండ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేండ్లకోసారి గుర్తింపు కార్డు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లోని వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ అప్డేట్ కోసం కావాల్సిన పత్రాలు:
రేషన్ కార్డ్,ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ ఫోటో, పాస్బుక్, చిరునామా పత్రాలు తదితర డాక్యుమెంట్లను గుర్తింపు పత్రాలు వాడవచ్చు. విద్యార్థులైతే వారి విద్యా సంస్థ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), మార్క్ షీట్, పాన్/ ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడతాయని పేర్కొంది. అలాగే మూడు నెలల్లోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్లుల రశీదులు కూడా అడ్రస్ ధ్రువీకరణ పత్రాలుగా ఇచ్చి అప్డేట్ చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల స్కాన్ చేసి ‘మై ఆధార్’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.