ఆ గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
ఆర్థికపరమైన విషయాలలో నెలనెల కొత్త కొత్త నిబంధనలు అమలు అవుతుంటాయి. అలాగే ఇప్పుడు అక్టోబర్ నెల ప్రారంభమైంది. డీమ్యాట్ ..
ఆర్థికపరమైన విషయాలలో నెలనెల కొత్త కొత్త నిబంధనలు అమలు అవుతుంటాయి. అలాగే ఇప్పుడు అక్టోబర్ నెల ప్రారంభమైంది. డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్ ప్రకటించేందుకు గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నామినీని నమోదు చేసుకునేందుకు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగించింది సెబీ. ఈలోగా డీమ్యాట్ ఖాతాదారులు తప్పకుండా నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సెబీ వెల్లడించింది. ఖాతాదారుల అభ్యర్థల మేరకు నామినీ పేరును అప్డేట్ చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు తెలిపింది. ఈ గడువులోగా నామినీని ప్రకటించడం తప్పనిసరి. లేదా నామినీ కోరుకోకపోతే డిక్లరేషన్ లెటర్ ద్వారా స్పష్టత ఇవ్వాలని సెబీ పేర్కొంది. గత ఏడాది జూన్ 15, 2022న జారీ చేసిన సర్క్యులర్‌లో సెబీ నామినీ ప్రకటన చేసింది. నామినీని చేర్చకపోతే మీ ఫోలియోలు (షేర్లు, ఇతర ఆర్థిక ఆస్తులు) స్తంభింపజేయబడతాయని తెలిపింది.
డీమ్యాట్ ఖాతా కోసం నామినేట్ చేయడం ఎలా?
➦ నామినీ ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండింటిలోనూ డీమ్యాట్ ఖాతాను అప్డేట్ చేయవచ్చు.
➦ ఆఫ్‌లైన్‌లో చేయడానికి: మీ డీమ్యాట్ ఖాతా ఉన్న డిపాజిటరీ పార్టిసిపేటింగ్ ఏజెన్సీల (DP ఆఫీస్) కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దరఖాస్తును సమర్పించడం ద్వారా నామినీని అప్డేట్ చేయవచ్చు. అలాగే
ఆన్లైన్లో నామినేషన్‌ను నమోదు చేయడం ఎలా?
➦ NSDL పోర్టల్ nsdl.co.inలోకి వెళ్లండి.
➦ హోమ్ పేజీలో 'నామినేట్ ఆన్లైన్' ఎంపికపై క్లిక్ చేయండి
➦ మీ DP ID, క్లయింట్ ID, PAN నంబర్‌ను వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
➦ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేయండి.
➦ నామినేట్ చేయడానికి రెండు ఆప్షన్లు
➦ మీరు నామినేట్ చేయడానికి ఆ ఎంపికను ఎంచుకుంటే కొత్త పేజీ తెరవబడుతుంది. అందులో నామినీ వివరాలను పూరించండి.
➦ eSign సర్వీస్ ప్రొవైడర్ పేజీలో చెక్ బాక్స్‌ను ప్రారంభించండి. తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
➦దీని తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, డిపాజిటరీ పార్టిసిపెంట్ ఏజెన్సీ నుండి నిర్ధారణ రావచ్చు. అలాంటప్పుడు, నామినేషన్ మీ డీమ్యాట్ ఖాతాలో అప్డేట్ చేయబడుతుంది.
నామినేషన్‌కు సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్:
ఖాతాదారుడు మరణిస్తే, అతని ఆస్తులకు వారసులు ఉండాలి. వారసులు ఎవరో చెప్పడమే నామినేషన్. డీమ్యాట్ ఖాతా కోసం గరిష్టంగా ముగ్గురిని నామినీలుగా పేర్కొనవచ్చు. ఒకసారి మీరు నామినీని పేరు పెట్టడం ఫైనల్ కాదు. ఖాతాదారుడు తన నామినీని ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంది. మెజారిటీ వయస్సు ఉన్న డీమ్యాట్ ఖాతాదారులు మాత్రమే నామినీని ప్రకటించవచ్చు. ట్రస్ట్, కార్పొరేట్ కంపెనీ, పార్టనర్షిప్ కంపెనీ మొదలైనవి నామినీలను ప్రకటించలేవు.