ఆ దేశం సంపన్నంగా మారబోతోందా? పవిత్ర నగరంలో భారీగా బంగారం నిల్వలు..
చమురు అమ్మే సౌదీ అరేబియా ఇప్పుడు బంగారం అమ్మి సంపన్న దేశంగా మారబోతోందా...? అంటే అవుననే సమాధానం వస్తోంది.
చమురు అమ్మే సౌదీ అరేబియా ఇప్పుడు బంగారం అమ్మి సంపన్న దేశంగా మారబోతోందా...? అంటే అవుననే సమాధానం వస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో భారీ బంగారం గనిని గుర్తించింది అక్కడి ప్రభుత్వం. ఈ విషయమై సౌదీ అరేబియా మైనింగ్ కంపెనీ మాడెన్ ఈ సమాచారం అందించింది. ప్రస్తుతం ఉన్న బంగారు గని మన్సూరా మస్సారా అనే ప్రాంతంకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు మైనింగ్ కంపెనీ మాడెన్ గురువారం తెలిపింది. ఖనిజ ఉత్పత్తి శ్రేణిని నిర్మించే లక్ష్యంతో మాడెన్ ఇంటెన్సివ్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్లో ఇది మొదటి ఆవిష్కరణ. దీనిని 2022లో ప్రారంభించగా, అదే ఏడాదిలో 11,982.84 ఔన్సుల బంగారం ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.
దీనికి సంబంధించిన వివరరాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాడెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబర్ట్ విల్ట్ వెల్లడించారు. మాడెన్ కంపెనీ 2024లో మన్సౌరా మస్సారా చుట్టూ డ్రిల్లింగ్ కార్యకలాపాలను పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.రాబోయే సంవత్సరాల్లో మేము చేయాలనుకుంటున్న అనేక ఆవిష్కరణలలో ఈ ఆవిష్కరణ మొదటిది అని, ఇంకా చేసే ప్రణాళికలు ఎన్నో ఉన్నాయని అన్నారు.
మాడెన్ మన్సౌరా మస్సారా గనిని అలాగే జబల్ అల్-ఘద్రా, బిర్ అల్-తవిలా వద్ద డ్రిల్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అక్కడికి ఉత్తరంగా 25 కి.మీ దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో తవ్వితే సానుకూల ఫలితాలు రావడంతో 125 కిలోమీటర్ల మేర బంగారం బయటపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సౌదీ అరేబియాలో ప్రపంచ స్థాయి గోల్డ్ బెల్ట్ అభివృద్ధి చెందుతుంది. 2023 చివరి నాటికి మన్సౌరా మస్సారా సుమారుగా 7 మిలియన్ ఔన్సుల బంగారు వనరులను, సంవత్సరానికి 250,000 ఔన్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంది.
ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశం ఏది?
అంటార్కిటికా మినహా ప్రపంచంలోని ప్రతిచోటా కొద్దిగా బంగారం ఉత్పత్తి అవుతుంది. చైనాలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి అవుతుంది. 2022 సంవత్సరపు డేటా ప్రకారం.. ప్రపంచ బంగారం ఉత్పత్తిలో 10% ఉత్పత్తి చేసే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఉత్పత్తి చేసే దేశం. 2022లో చైనా 375 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. చైనా తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఘనా వంటి దేశాల్లో ఎక్కువ బంగారం ఉత్పత్తి అవుతుంది.