పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఆ గడువు మే 31 వరకు పొడిగింపు
అధిక పెన్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్‌వో మే 31వ తేదీ వరకు..
అధిక పెన్షన్‌ను ఎంచుకునే ఉద్యోగుల వేతన వివరాల్ని యాజమాన్యాలు అప్లోడ్ చేయడానికి ఈపీఎఫ్‌వో మే 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఇచ్చిన ఈ గడువు డిసెంబర్ 31తో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అధిక పెన్షన్‌కు అర్హులైన ఈపీఎఫ్‌వో పెన్షనర్లు/సభ్యులు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని 2023 ఫిబ్రవరి 26న సంస్థ ప్రారంభించింది. ఉద్యోగుల దరఖాస్తులకు పలుదఫాలు పెంచిన గడువు జూలై 11తో ముగిసింది. ఈ సమయానికి 17.49 లక్షల దరఖాస్తులు ఈపీఎఫ్‌వోకు అందాయి.
అలాగే అధిక పెన్షన్ కోసం ఆప్షన్/ఉమ్మడి ఆప్షన్ వ్యాలిడేట్ చేయడానికి దరఖాస్తులు సమర్పించే చివరితేదీని 2023 జూలై 11 వరకు పొడిగించినట్లు తెలిపింది. దరఖాస్తుదారుల వేతన వివరాల్ని అప్లోడ్ చేయడానికి యాజమాన్యాలు, యాజమాన్యాల అసోసియేషన్లు గడువు పెంచాలన్న వినతి మేరకు ముందుగా గత ఏడాది సెప్టెంబర్ 30, అటుతర్వాత డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ వచ్చింది. ఇంకా యాజమాన్యాల వద్ద 3.6 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంతో ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు చైర్మన్ గడువును పెంచినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.