పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను ఎప్పుడు సమర్పించాలి?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లను కలిగి ఉంది. వారు సంవత్సరానికి ఒకసారి..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లను కలిగి ఉంది. వారు సంవత్సరానికి ఒకసారి తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అంటే లైఫ్ సర్టిఫికేట్. 15,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎస్ (ఉద్యోగుల పెన్షన్ పథకం) ప్రయోజనం లభిస్తుంది. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ఈ పథకం ప్రారంభించబడింది.
EPS పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించవచ్చు:
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం.. ఈపీఎస్ సభ్యులు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఉదాహరణకు.. ఫిబ్రవరి 2023లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ ఫిబ్రవరి 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈపీఎస్ సభ్యుడిగా ఉండి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలనుకుంటే, మీరు జీవిత ధృవీకరణ పత్రాన్ని IPPB, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్‌మ్యాన్, ఉమాంగ్ యాప్, కామన్ సర్వీస్ సెంటర్ లేదా సమీప పోస్టాఫీసులో సమర్పించవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కావాల్సిన పత్రాలు:
- PPO నంబర్
- ఆధార్ సంఖ్య
- బ్యాంకు ఖాతా వివరాలు
- మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడింది
- మీరు ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించవచ్చు
ఆధార్, బయోమెట్రిక్స్ ద్వారా ఒక ప్రత్యేక IDని సృష్టించడం ద్వారా మీరు మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని డిజిటల్‌గా సమర్పించవచ్చు. ముందుగా ఆధార్ సహాయంతో యూనిక్ ఐడీని క్రియేట్ చేసుకోండి. దీని తర్వాత మీరు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీని కోసం, మీరు https://jeevanpramaan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.