Mon Nov 25 2024 21:59:44 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : మళ్లీ ఎగబాగుతుంది.. ఇక ఆగుతుందా? ఆగదా సామీ
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి
బంగారం అంటేనే మక్కువ. మోజు అనే కంటే అంతకంటే ప్రియమైన వస్తువు మహిళలకు మరేదీ ఉండదు. అందుకే బంగారానికి భారతీయ కుటుంబాల్లో అంత స్థానం ఉంది. మెడలో బంగారు నగలు ఎన్ని ఉంటే అంత గౌరవం దక్కుతుందన్న నమ్మకం మహిళల్లో ఉండటమే నిత్యం కొనుగోళ్లతో జ్యుయలరీ షాపులు రద్దీగా ఉండటానికి కారణంగా చెప్పాలి. ఎప్పడు పడే అప్పుడు కొనేయడానికి మహిళలు రెడీ అయిపోతారు. దీనికి ఒక ముహూర్తం అంటూ ఏమీ పెట్టుకోరు. అందుకే బంగారం, వెండి వస్తువులకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు.
దిగుమతులు లేక...
డిమాండ్ అయితే బంగారానికి, వెండికి రోజురోజుకూ పెరుగుతుంది కానీ, డిమాండ్ కు తగిన స్థాయిలో దిగుమతులు లేవు. అంతే బంగారాన్ని ఎంతమందైనాకొనుగోలు చేయాల్సి రావాల్సి వస్తుంది. అందుకే బంగారం ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు ఎప్పటికప్పుడు అంచనాలు వేస్తూ చెబుతూ వస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ రేపటి తో ముగియనుంది. మరో మూడు నెలలు ముహూర్తాలుండవు. అయినా బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉండటంతో ఇక తగ్గేది ఉండదన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తుంది.
స్వ్పలంగా పెరిగి...
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. పెరిగింది స్వల్పమే అయినా అది కూడా భారంగానే భావించాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 84,600 రూపాయలుగా నమోదయింది.
Next Story