Mon Dec 23 2024 17:29:24 GMT+0000 (Coordinated Universal Time)
Flipkart Amazon Sales: భారీ ఆఫర్లు రాబోతున్నాయి.. సిద్ధంగా ఉన్నారా?
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ త్వరలో
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ త్వరలో ప్రారంభమవనున్నాయి. రెండు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే సేల్స్ కు సంబంధించిన టీజర్లను విడుదల చేశాయి. వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లపై పెద్ద తగ్గింపులను అందించబోతున్నాయి. నాయిస్, బోట్, యాపిల్ వంటి టాప్ బ్రాండ్ల నుండి భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. అలాగే బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు, టాబ్లెట్లపై 60 శాతం, హెడ్ఫోన్లపై 70 శాతం తగ్గింపును అందిస్తామని అమెజాన్ తెలిపింది. అలాగే Alexa పరికరాలు, Fire TV స్టిక్‌లపై కూడా తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. Samsung Galaxy S23 Ultra రూ. 1,00,000 లోపు లభిస్తుందని అమెజాన్ చెబుతోంది. Flipkart 9వ జెనరేషన్ ఐప్యాడ్‌ను రూ. 20,000 లోపు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది.
Motorola ఫోన్లపై సెప్టెంబర్ 16న, సెప్టెంబర్ 17న Realme, సెప్టెంబర్ 18న Poco, సెప్టెంబర్ 19న Vivo, సెప్టెంబర్ 20న Samsung, సెప్టెంబర్ 23న iPhoneలపై భారీ డీల్‌లు ఉంటాయని Flipkart వెల్లడించింది. Oppo , Xiaomi, Infinix, Google Pixel ఫోన్ డీల్‌లు సెప్టెంబర్ 21న ఉండనుంది. ఈ నెలాఖరులోగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
Next Story