Fri Nov 08 2024 05:59:03 GMT+0000 (Coordinated Universal Time)
UPI Payments: నేటి నుండి యూపీఐ పేమెంట్స్ లో భారీ మార్పు
UPI వినియోగదారులు ఒకే లావాదేవీలో రూ. 5లక్షల రూపాయల వరకు
ఈ ఆదివారం (సెప్టెంబర్ 15, 2024) నుండి, UPI వినియోగదారులు ఒకే లావాదేవీలో రూ. 5లక్షల రూపాయల వరకు బదిలీ చేయవచ్చు. ఆగస్టు 8 ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన తర్వాత దేశంలో UPI కార్యకలాపాలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పన్ను చెల్లింపుల కోసం లావాదేవీల పరిమితులను పెంచింది. UPIకి పెరుగుతున్న జనాదరణ కారణంగా, సంబంధిత వర్గాలకు UPI ద్వారా లావాదేవీ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని NPCI అభిప్రాయపడింది. NPCI ఇటీవల బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు (PSPలు), UPI అప్లికేషన్లకు ప్రత్యేకంగా పన్ను చెల్లింపు లావాదేవీల కోసం పరిమితిని పెంచడానికి అవకాశం ఇచ్చింది.
ఇంతకు ముందు నిర్దిష్ట వర్గాల చెల్లింపులకు మినహా UPI కోసం లావాదేవీల పరిమితి రూ. 1 లక్షగా ఉంది. యుపిఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని తాజాగా నిర్ణయించారు. ఇది UPI ద్వారా వినియోగదారుల పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఆస్పత్రి, విద్యా సంస్థల బిల్లులు, ఐపీవో దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు యూపీఐ ద్వారా ఒకేసారి రూ.5 లక్షల చెల్లింపులు చేయవచ్చు.
Next Story