Mon Dec 23 2024 10:00:14 GMT+0000 (Coordinated Universal Time)
Adani : అంబానీని మళ్లీ దాటేసిన అదానీ.. అపర కుబేరుడిగా మారి
గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచాడు
ధనవంతుల జాబితాలో కొందరే ఉంటారు. వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారే. అందులో మన దేశంలో కొందరు మాత్రమే అత్యంత ధనవంతులున్నారు. వారిలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారి పేర్లు ఎక్కువగా వినపడుతుంటాయి. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ ఈ మేరకు ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించింది.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ...
ఈ జాబితాలో గౌతమ్ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలిచాడు. అదానీ గ్రూపు కంపెనీ షేర్లు పుంజుకోవడంతో మరోసారి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అదానీ దాటేశారు. అదానీ మొత్తం 111 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో పదకొండో స్థానంలో నిలిచారు. అంబానీ మాత్రం 109 బిలియన్ డాలర్ల సంపదతో పన్నెండో స్థానంలో నిలిచారు.
Next Story