Mon Dec 15 2025 06:30:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Daily Updates: బంగారం.. మళ్లీ తగ్గిందోచ్
బంగారం ధర మళ్లీ తగ్గింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో

బంగారం ధర మళ్లీ తగ్గింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయింది. పది గ్రాముల బంగారం ధర రూ. 69,810 వద్ద కొనసాగుతూ ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పడిపోయింది, దీంతో రూ. 63,990 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర కూడా రూ.100 తగ్గి, ఒక కిలో రూ.84,400 వద్ద అమ్ముడవుతోంది.
ముంబైలో, కోల్‌కతా, హైదరాబాద్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,810గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.69,940 ఉండగా.. , బెంగళూరులో రూ.69,810.. , చెన్నైలో రూ.70,140గా నమోదైంది. ముంబైలో, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.63,990 వద్ద ఉంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.64,140, రూ.63,990, రూ.64,290గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.84,400గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900గా ఉంది.
Next Story

