Fri Nov 22 2024 14:49:45 GMT+0000 (Coordinated Universal Time)
Gold And Silver Price: తగ్గుతున్నాయండోయ్.. దేశంలో బంగారం ధరలు ఇవే!
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 73,140 రూపాయల వద్ద ఉంది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 73,140 రూపాయల వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,040 ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ. 250 తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ. 74,350కి చేరుకుంది. వెండి ధరలు 87,000 వద్ద పలుకుతోంది.
వెండి ధర గురువారం రూ.2,000 పెరిగి రెండు వారాల గరిష్ఠ స్థాయి రూ.87,000కి చేరింది. అంతకు ముందు సెషన్లో వెండి కిలో రూ.85,000 వద్ద ముగిసింది.99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.74,250 నుంచి రూ.250 తగ్గి రూ.74,000కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు మూడు వారాల పాటు స్పాట్ గోల్డ్ ధర $2470-$2530 మధ్య పలికింది. స్పాట్ గోల్డ్ గురువారం నాడు $2555 రికార్డు స్థాయికి చేరింది.
Next Story