Mon Dec 23 2024 11:37:43 GMT+0000 (Coordinated Universal Time)
హమ్మయ్య.. గుడ్ న్యూస్
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వెళుతున్న బంగారం ధరలు నేడు
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వెళుతున్న బంగారం ధరలు నేడు కాస్త స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ 18న హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేటు పెరగ్గా.. ఇవాళ మాత్రం స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి ప్రస్తుతం రూ. 57,400 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620 పలుకుతోంది. ఢిల్లీ లో ప్రస్తుతం 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 57,550 మార్కు వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 57,400 రూపాయలు.. 24 క్యారెట్ల బంగారం ధర 62,620 రూపాయలు ఉంది.
ఇక వెండి ధరలు కాస్త తగ్గాయి. ఢిల్లీలో రూ. 500 పడిపోయి కేజీ సిల్వర్ ధర రూ. 77,500 వద్ద నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 500 తగ్గి రూ. 79,500 మార్కుకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2038 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 24 డాలర్ల లెవెల్స్‌కు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.095 వద్ద ఉంది.
Next Story