Sun Dec 22 2024 21:24:25 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rate: ఇంకాస్త తగ్గిన బంగారం ధరలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ కారణంగా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ కారణంగా బంగారం ధర తగ్గుతూ ఉంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసే సమయానికి 10 గ్రాముల గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 4 వేలు తగ్గి ఊహించని గుడ్ న్యూస్ ను మిడిల్ క్లాస్ ప్రజలకు ఇచ్చింది. దేశంలో బంగారం ధరలు గురువారం కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 64,950గా కొనసాగుతోంది. 10 రూపాయల తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 70,850కి చేరింది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,090, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,000 పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.64,940గా.. 24 క్యారెట్ల పసిడి రూ. 70,850గా నమోదైంది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,940గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,850గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,940గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,850గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 91,900 పలుకుతోంది.
Next Story