Mon Dec 23 2024 08:07:22 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం కొనాలనుందా?
ఇటీవలి కాలంలో కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం ధర పెరిగింది
ఇటీవలి కాలంలో కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం ధర పెరిగింది. ఏకంగా రూ. 310 వరకూ పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం రేటు 22 క్యారెట్లపై 58,050 రూపాయల మార్కుకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఢిల్లీలో 10 గ్రాములపై ఏకంగా రూ. 320 పెరిగి రూ. 63,310 మార్కుకు చేరింది. ఇక హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్లపై రూ. 310 పెరిగింది.. ఇప్పుడు 10 గ్రాములు కొనాలంటే రూ. 57,900 పెట్టాల్సింది.. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 63,160 కి చేరుకుంది.
వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో తాజాగా రూ. 500 పెరిగి కిలోకు రూ. 76,200 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. ఢిల్లీలో రూ. 300 పెరిగి ప్రస్తుతం రూ. 74,500 మార్కుకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2083 డాలర్లకు చేరింది. అదే విధంగా స్పాట్ సిల్వర్ రేటు 23 డాలర్లపైకి చేరింది.
Next Story