మగువలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధర
భారతదేశంలోని ప్రజలు బంగారంతో చేసిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతుటారు.
భారతదేశంలోని ప్రజలు బంగారంతో చేసిన వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతుటారు. ఈ బంగారం ప్రపంచ ఉత్పత్తి, దేశ కరెన్సీ బలం, దేశీయ డిమాండ్ వంటి ఇతర వస్తువుల ధర మొదలైన అనేక అంశాలచే ప్రభావితమవుతుంది. చాలా మంది బంగారాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకుంటారు. మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. ప్రజలు బ్యాంకు డిపాజిట్లు లేదా స్టాక్ మార్కెట్కు బదులుగా బంగారంలో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకుంటున్నారు, ఎందుకంటే బంగారం సాధారణంగా హామీ, నమ్మదగిన రాబడిని ఇస్తుంది. అలాగే ధరలు పెరిగినా తగ్గినా మహిళలు అత్యంతంగా ఇష్టపడేది బంగారం. ప్రతి రోజు బంగారం షాపుల్లో మహిళలతో కిటకిటలాడుతుంటాయి.
ఇక అసలు విషయానికొస్తే తాజాగా అక్టోబర్ 31న దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై 210 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తతం 57,200 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 230 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 62,400 ఉంది. ఈ ధరలు మంగళవారం ఉదయం 5.50 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.
అత్యంత విలువైన, ఖరీదైన లోహాలలో ఒకటి బంగారం భారతదేశంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆభరణాల రూపంలోనే కాదు. కానీ బంగారం, నాణేల రూపాల్లో కూడా విలువైనది. బంగారం ధరలు నిరంతరాయంగా పెరిగినప్పటికీ, భారతదేశంలో ప్రజలు బంగారంపై క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తున్నారు.
➦ హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,350 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,550 ఉంది.
➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.
➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,200 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400 ఉంది.
➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,350 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,560 ఉంది.
➦ ఇక బంగారం ధరలు తగ్గితే వెండి మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండిపై 1000 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 75,600 వద్ద కొనసాగుతోంది.