Sun Dec 22 2024 21:52:28 GMT+0000 (Coordinated Universal Time)
Gold And Silver దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో
బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో కొనాలా లేదా అనే డౌట్ ప్రజల్లో నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1320 పెరిగి రూ. 74,610కి చేరుకోగా, అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,410కి చేరుకుంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,460కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 68,260 గా నమోదైంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,460కి కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,260 గా పలుకుతోంది.
గత 24 గంటల్లో వెండి ధర కిలోకు 3200 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి రూ. 89600 పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి రూ. 95100 పలుకుతోంది. విజయవాడలో కిలో వెండి ధర 95100 రూపాయలుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ. 89600 గా కిలో వెండి ధర ఉంది.
Next Story