Sat Nov 23 2024 04:51:34 GMT+0000 (Coordinated Universal Time)
తగ్గదా.. బంగారం
దేశీయ మార్కెట్లలో చూస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర
బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్నాయని అంచనా వేస్తున్నారు. తాజాగా నమోదైన బంగారం ధరల ప్రకారం 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. 6 రోజుల వ్యవధిలో తులం గోల్డ్ రేటు హైదరాబాద్ మార్కెట్లో దాదాపు రూ. 1200 వరకు తగ్గుముఖం పట్టగా.. తర్వాత రూ. 1000కిపైగా పెరిగింది. వరుసగా రెండో రోజూ గోల్డ్ రేటు పెరిగింది.
దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర 100 పెరిగి ప్రస్తుతం రూ. 57,750 మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు ఒక్కరోజే రూ. 110 ఎగబాకి రూ. 63 వేల మార్కును కూడా తాకింది. అంతకుముందు వారంలో భారీగా బంగారం ధర తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 100 పెరిగి ప్రస్తుతం తులానికి రూ. 57,900 పలుకుతోంది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 110 ఎగబాకి 10 గ్రాములకు రూ. 63,150 వద్ద కొనసాగుతోంది. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 కు చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,600 వద్ద ఉంది.
సిల్వర్ రేటు ఢిల్లీ మార్కెట్లో ఒక్కరోజే రూ. 1000 ఎగబాకి రూ. 78,500 మార్కు వద్ద ఉంది. అంతకుముందు రోజు రూ. 2500 పెరిగింది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర రూ. 80,500 మార్కు వద్ద ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500 ఉండగా.. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.
Next Story