Mon Dec 23 2024 07:45:23 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices: బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?
శనివారం నాడు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర
Gold Prices: శనివారం నాడు దేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గడంతో ధర రూ. 58,000కి చేరింది. 1 గ్రామ్ 22క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 5,800గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గి.. రూ. 63,270కి చేరింది. శుక్రవారం నాడు ఈ ధర రూ. 63,380గా ఉండేది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,270గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,270గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,400గా ఉంది. బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,600గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,930గా ఉంది. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 58000గా, 24 క్యారెట్ల పసిడి రూ. 63,270గానూ నమోదైంది.
దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రూ. 76,600గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 78,000 పలుకుతోంది. కోల్కతాలో కిలో వెండి 76,600 రూపాయలు ఉండగా.. బెంగళూరులో రూ. 74,000గా కొనసాగుతూ ఉంది.
Next Story