Wed Nov 20 2024 15:25:58 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఎంత తగ్గిందని కాదు చెల్లిమ్మా.. తగ్గిందా? లేదా? గుడ్న్యూసే కదా?
కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కొద్దిగా తగ్గాయి.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది ప్రమాదానికి సంకేతతమంటున్నారు. మార్కెట్ నిపుణులు. సహజంగా వరసగా స్వల్పంగా బంగారం ధరలు ప్రతి రోజూ తగ్గుతుంటే పసిడిధరలు భారీగా పెరుగుతాయని అర్థం అని చెబుతుంటారు. ఇది గతంలో జరిగిన విషయాలపై ఆధారపడి చెబుతున్న మాట అని అంటున్నారు. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పుడూ దిగిరావు. ఎందుకంటే దానికి డిమాండ్ ఎప్పుడూ పడిపోదు. ఏ జనరేషన్ అయినా గోల్డ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనరేషన్ లు మారినా పుత్తడి విషయంలో వారి ఆలోచన మాత్రం మారడం లేదు. అందుకే బంగారం ధరలు ఎప్పుడూ మన ఆలోచనలకు తగినట్లుగా, మనం ఆశించినట్లుగా తగ్గే అవకాశం లేదు.
ధరలు పెరగడానికి...
బంగారం ధరలు ప్రియమవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, దిగుమతులు తగ్గడం వంటి కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల సీజన్ కాదు. ముహూర్తాలు లేకపోయినా అక్టోబరు నెల నుంచి మళ్లీ పెళ్లిళ్లు, పండగల సీజన్ ప్రారంభం కానుంది. అది ప్రారంభం కాక మునుపే ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఈసారి బంగారం ధరలు భారీగా పెరుగుతాయన్నది వ్యాపారులు కూడా చెబుతున్న మాట. అందుకే ధరలు తగ్గిననప్పుడే పసిడిని కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
ధరలు తగ్గుతున్నా...
గత కొద్ది రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 90,800 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం ఈరోజు కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే ధరలు పెరిగే ప్రమాదముందన్నది నిపుణుల మాట.
Next Story