Tue Nov 26 2024 06:55:32 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఆల్ టైం రికార్డు క్రియేట్ చేస్తుందట.. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు
పసిడి ధరలు పైపైకి చూస్తాయి. నేల చూపులు చూసేది తక్కువ సార్లే. బంగారం ధర ఈ ఏడాది డెబ్బయి వేల రూపాయలు దాటుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కేవలం పదిహేను రోజుల్లోనే రెండు వేల రూపాయల మేరకు బంగారం ధర పెరిగింది. ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ పూర్తయినప్పటికీ బంగారం ధరలు తగ్గేది లేదని అంటున్నారు.
అనేక కారణాలు...
బంగారం ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం బంగారం దిగుమతులు తగ్గించడంతో పాటు, వినియోగం పెరగడం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు వంటి కారణాలతో పసిడి ధరలు భారీగా పెరగక తప్పవని చెబుతున్నారు. పెట్టుబడిగా చూసేవారు కూడా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, ఫ్యూచర్ లో బంగారం మరింత భారంగా మారనుందన్న హెచ్చరికలతో కొనుగోళ్లు కూడా ఇటీవల కాలంలో పెరిగాయి.
నేడు స్థిరంగానే...
దేశంలో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత కొద్ది రోజులులగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగడం కూడా ఊరటకల్గించే అంశమే. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,590 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 80,300 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story