Mon Dec 23 2024 02:53:47 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rate:బంగారం కొనలేమా?
దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర పెరుగుతూ ఉంది. మార్చి నెల ప్రారంభం
Gold Rate:దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర పెరుగుతూ ఉంది. మార్చి నెల ప్రారంభం నుంచి తులం రేటు ఏకంగా రూ.2500 పైన పెరిగి షాక్ ఇచ్చింది. నేడు తులం బంగారం ధర ఏకంగా రూ. 400 మేర పెరిగింది. వెండి సైతం బంగారం బాటలోనే ప్రయాణిస్తూ ఉంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర నేడు ఏకంగా రూ. 400 మేర పెరిగింది. ప్రస్తుతం రూ. 60,100 కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పెరిగి రూ. 65,560 కు చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 400 పెరిగి రూ. 60,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఢిల్లీలో తులానికి రూ. 430 పెరిగి.. రూ.65,710 చేరింది. బంగారం కిలోకు 500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 78,500 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బాగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2159 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24. 35 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Next Story