Mon Dec 23 2024 11:45:29 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్ ఎంతుందంటే?
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ ఉన్నాయి. నేడు బంగారం ధరల్లో
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పెరుగుతూ ఉన్నాయి. నేడు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉండడంతో బంగారం కొనాలని అనుకునే వాళ్లకు స్వల్ప ఊరట లభించనుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,960 లుగా ఉంది. వెండి కిలో ధర రూ. 500 మేర తగ్గి రూ.74,600 లుగా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,110 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల రేటు రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800, 24 క్యారెట్ల ధర రూ.61,960 వద్ద కొనసాగుతుంది.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,960 గా నమోదైంది.
Next Story