Tue Nov 05 2024 08:03:24 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : ఇలా పెరుగుతూ పోతూనే ఉంటే ఎలా..కొనుగోలు చేయాలా? వద్దా?
ఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. పసిడి ప్రియులకు ఇది షాకింగ్ వార్త లాంటిదే. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం, విదేశాల్లో నెలకొన్న మాద్యం, దిగుమతులు తగ్గిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వడ్డీరేట్లలో మార్పులు కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
కొద్ది రోజులుగా...
బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడమనేది జరగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగదారులు అధిక మొత్తం వెచ్చించి తక్కవ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత తగ్గినా ఇక ప్రయోజనం ఏంటని కొనుగోలు దారులు ప్రశ్నిస్తున్నారు. బంగారం, వెండి ముఖ్యమైన వస్తువులు కావడంతో వాటి ధరలు పెరుగడానికి చెబుతున్న కారణాలు కొనుగోళ్లపై మాత్రం ప్రభావం చూపడం లేదు.
నేటి ధరలు..
ఈరోజు దేశంలో బంగారం స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. అలాగే కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,210 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,330 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర మాత్రం 88,400 రూపాయలుగా ఉంది.
Next Story