Mon Dec 23 2024 08:02:57 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price: కాస్త తగ్గిన బంగారం ధర!
24 క్యారెట్ల బంగారం ధర శనివారం ప్రారంభ ట్రేడింగ్లో రూ. 10 తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ. 80,550 వద్ద ట్రేడవుతోంది
24 క్యారెట్ల బంగారం ధర శనివారం ప్రారంభ ట్రేడింగ్లో రూ. 10 తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ. 80,550 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.100 తగ్గగా, ఒక కిలో వెండి ధర ఇప్పుడు రూ.96,900గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గింది. పది గ్రాముల బంగారం ధర మార్కెట్ లో రూ.73,840 వద్ద విక్రయించబడింది.
ముంబై, కోల్కతా, హైదరాబాద్లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,550గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,700గా ఉండగా, బెంగళూరు, చెన్నై నగరాల్లో రూ.80,550గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి ధర రూ.96,900గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,05,900గా ఉంది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ధర ఔన్సుకు 2736.80 డాలర్లకు దిగొచ్చింది. అంతకుముందు రోజు ఇది 2780 డాలర్ల స్థాయిలో ఉండేది. ఇక స్పాట్ సిల్వర్ ధర 32.47 డాలర్ల వద్ద ఉంది.
Next Story