Mon Nov 25 2024 12:43:55 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : బంగారం ధరలు మరింత ప్రియం కాకముందే కొంటే మంచిదండోయ్
బంగారం ధరలు నిత్యం పెరుగుతుంటాయి. దాని వెంటే వెండి కూడా పరుగులు తీస్తుంటుంది.
బంగారం ధరలు నిత్యం పెరుగుతుంటాయి. దాని వెంటే వెండి కూడా పరుగులు తీస్తుంటుంది. బంగారం, వెండి ధరలు తగ్గడం అంటే చాలా అరుదైన విషయం. కానీ తగ్గినప్పటికీ ధరలు స్వల్పంగానే తగ్గుతాయి. ఒక్కసారి బంగారం, వెండి ధరలు పెరిగాయంటే ఇక ఆ స్థాయిలో తగ్గడం అనేది జరగదన్నది వ్యాపారులు చెబుతున్న మాట. బంగారాన్ని ఎప్పుడు కొనుగోలు చేసినా నష్టం అంటూ ఉండదన్న భరోసా వ్యాపారులు ఇస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి ఇది సులువైన మార్గమమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఎదురు చూడటం కంటే కొనుగోలు చేయడమే బెటర్ అంటున్నారు.
సీజన్ ప్రారంభమయితే...
ఇప్పుడు సీజన్ కాకపోవడం, ముహూర్తాలు లేకపోవడంతో ధరలు కొంత నెమ్మదిగా కదులుతుంది. అదే మూఢమి పూర్తయి ముహూర్తాలు ప్రారంభమయితే ఇక బంగారం, వెండి ధరలను అదుపు చేయడం ఎవరి తరమూ కాదన్నది నిపుణులు చెబుతున్న మాట. కొనుగోళ్లు పెరగడమే కాకుండా బంగారం నిల్వలు తగినంత లేకపోవడంతో పాటు, దిగుమతులు తగ్గడం కారణంగా రానున్న కాలంలో పసిడి ధరలు మరింత ప్రియమవుతాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకుల ప్రభావం కూడా వీటిపై స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.
నేటి ధరలు...
ఈరోజు బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పుడే బంగారం, వెండిని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ధరలు మరింత పెరుగుతాయని చెబుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగార ధర 66,190 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,210 రూపాయలుగా కొనసాగుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధరలు 95,500 రూపాయలుగా ట్రెండ్ అవుతున్నాయి.
Next Story