Mon Dec 23 2024 10:24:29 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : రోజుకు పదిరూపాయలు తగ్గుతూ.. ఒక్కసారి వందలు పెరుగుతుందా ఏంది సామీ?
బంగారం ధరలు మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. అదీ పెద్ద ధర కాదు. పది గ్రాముల ధరపై కేవలం పదిరూపాయలు మాత్రమే తగ్గింది
బంగారం ధరలు మూడు రోజుల నుంచి తగ్గుతున్నాయి. అదీ పెద్ద ధర కాదు. పది గ్రాముల ధరపై కేవలం పదిరూపాయలు మాత్రమే తగ్గుతూ వస్తుంది. అంటే మూడు రోజుల నుంచి పది గ్రాముల బంగారం ధరపై ముప్పయి రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఒక్కసారి పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తగ్గినప్పుడు కొద్దగా, పెరిగినప్పుడు భారీగా పెరగడం అలవాటు అని మార్కెట్ నిపుణులు సయితం చెబుతున్నారు. అందుకే రానున్న కాలంలో బంగారం ధర మరింత మండే అవకాశముంది.
భారీగా పెరగడానికి...
అవును.. నిపుణులు చెబుతున్నదిదే... పది రూపాయలు తగ్గింది కదా? అని ఇంకా తగ్గుతాయని అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే. పెరిగితే వంద రూపాయలకు పైగానే పది గ్రాముల ధర పెరుగుుతుంది. వంద నుంచి మూడు వందల రూపాయల వరకూ పెరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే మూడు రోజుల నుంచి తగ్గాయని సంబరపడొద్దని చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు కూడా వెలువడుతున్నాయి.
వెండి మాత్రం...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 57,950 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 62,830 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం వంద రూపాయలు తగ్గి 76,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story