Mon Dec 23 2024 14:49:40 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates : పసిడి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయంటే... గుడ్ న్యూస్ అనే చెప్పాలి
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలకు రెక్కలు ఉంటాయన్నది యదార్ధం. వాటి ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. తగ్గడమనేది అతి తక్కువ సార్లు జరుగుతుంది. పెరిగినప్పుడు వందల్లోనూ తగ్గినప్పుడు పదో పరకో తగ్గి కొనుగోలుదారులను నిరాశకు గురి చేస్తుంది. అయినా డిమాండ్ తగ్గని వస్తువు పసిడి కావడంతో కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. సీజన్ కు సంబంధం లేకుండా కొనుగోలు చేయడం ఇటీవల కాలంలో ఫ్యాషన్ అయిపోయింది. గతంలో బంగారం కొనుగోళ్లకు ఒక సీజన్ అంటూ ఉండేది. కానీ ఇప్పుడు అదేమీ లేదు.
భరోసా కోసం...
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితుల్లో తమ వద్ద డబ్బులున్నప్పుడు వెంటనే కొనుగోలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. పెట్టుబడిగా కూడా పసిడిని అనేక మంది భావిస్తుండటం కూడా గిరాకీ పెరగడానికి కారణం. బంగారం తమ వద్ద ఉంటే భద్రత ఉంటుందని, భరోసా లభిస్తుందని భావించి ఎక్కువ మంది బంగారంపైనే తమ సొమ్ములు వెచ్చిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయినప్పుడు ఆదుకున్నది బంగారమేనని చాలా మంది చెబుతున్నారు.
స్థిరంగానే....
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ధరల్లో హెచ్చు తగ్గులు లేకపోవడం కూడా కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అనే చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,800 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,970 రూపాయలుగా ఉందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. కిలో వెండి ధర మాత్రం 79,200 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story