Sat Dec 21 2024 08:26:14 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : ఎండల్లో హాయ్... హాయ్...తగ్గింది జాయ్.. జాయ్
పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది.
బంగారం ధరలు ఎండలను మించి మండిపోతున్నాయి. అస్సలు తగ్గేదే లేదన్నట్లుగా ఇటీవల కాలంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ధరలు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతుంది. అసలు బంగారాన్ని మనం సొంతం చేసుకునే అవకాశముందా? అన్న అనుమానాలు కూడా అనేక మందిలో బయలుదేరాయి. బంగారం పట్ల మక్కువ తగ్గించుకుని, ఆ సొమ్మును వేరే దానిలో మదుపు చేసుకోవడం మంచిదన్న అభిప్రాయానికి జనం వస్తున్నారంటే అతి శయోక్తి కాదు.
కొనాలని ఉన్నా...
కొందామంటే మన వద్ద ఉన్న డబ్బులకు గ్రాము బంగారం కూడా రాకపోయే. ఇక దాని కంటే పోస్టాఫీసులోనూ, బ్యాంకుల్లోనో వివిధ స్కీముల కింద దాచుకోవడం మంచిదన్న అభిప్రాయం కూడా చాలా మందిలో కలుగుతుంది. ఎందుకంటే బంగారాన్ని కొనుగోలు చేసే శక్తి ఇప్పుుడు చాలామందిలో లేదు. అంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా? అన్న వేదాంత ధోరణికి మహిళలు సయితం వెళ్లిపోయారు. అయితే పెళ్లిళ్ల సీజన్ ఇంకా నడుస్తుండటంతో బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు, నెల రోజుల్లోనే పది గ్రాముల బంగారంపై తొమ్మిది వేలు పెరిగింది.
స్వల్పంగా తగ్గి...
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,940 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,120 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 89,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story